ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి: ఎంపిడివో

77చూసినవారు
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో ఎర్రయ్య సూచించారు. నేలకొండపల్లి మండలం మంగాపురం తండా ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఉత్తములుగా ఎదగాలని సూచించారు. ప్రైవేటుకు ధీటుగా ఉపాధ్యాయులు బోధన సాగిస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :