ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులను పెండింగ్ లో పెడితే వేటు తప్పదని తెలంగాణ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2. 34 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 2 వారాల్లో 24, 778 మాత్రమే పరిష్కరించారని పలు జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోల పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు