ఏదులాపురం సొసైటీ చైర్మన్ పై విచారణ పూర్తి

52చూసినవారు
ఏదులాపురం సొసైటీ చైర్మన్ పై విచారణ పూర్తి
ఏదులాపురం సొసైటీ చైర్మన్​ జర్పుల లక్ష్మణ్​ పై పలు ఫిర్యాదులు రైతుల నుంచి అందడంతో డీసీవో గంగాధర్​ విచారణాధికారులను నియమించారు. విచారణాధికారులుగా వచ్చిన ఉషశ్రీ, రాంరెడ్డిలు గురువారం సొసైటీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. నేరుగా రైతుల చేత వాంగ్మూలం చేపట్టారు. రైతులు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైర్మన్​ లక్ష్మణ్​ మాయమాటలు చెప్పి అక్రమంగా డబ్బులు తీసుకున్నారని అధికారులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్