ఖమ్మం జిల్లాలోని రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఔట్సోర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, సత్తుపల్లి మైనార్టీ గురుకుల పాఠశాల/ కళాశాలలో (బాయ్స్)-2 పోస్టులకు గాను స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి జులై 2 వరకు ఖమ్మం ఐడిఓసి లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.