సాగర్ జలాలు వెంటనే విడుదల చేసి పంటలను కాపాడాలని సిపిఎం మండల కార్యదర్శి కె. వి. రామిరెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే సాగర్ జలాలు విడుదల చేయాలని కోరుతూ శనివారం నేలకొండపల్లి ఇరిగేషన్ డిఈ కార్యాలయం ముట్టడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కళ్ళముందు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లనే పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.