ఖమ్మం రూరల్ మండలంలోని జలగంగనర్ శ్మశాన వాటికను మరోచోట ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ముజమ్మిలాఖాన్ గురువారం తెలిపారు. వరదల నుంచి రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మించే క్రమాన శ్మశానవాటికలో కొంత భూమి సేకరించాల్సి వస్తోందన్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమి గుర్తించి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సూచించారు.