ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ కొనియాడారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో రామయ్య పార్థివదేహాన్ని సందర్శించి సీపీఎం నేతలు నివాళులు అర్పించారు. రామయ్య మరణం సమాజానికి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. బండి రమేష్, శ్రీను ఉన్నారు.