ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర చికిత్స పొందిన పేదలను ఆదుకునేందుకు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎంపీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ శనివారం పంపిణీ చేశారు. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు సంబంధించి పలువురికి రూ. 1. 10 లక్షల విలువచేసే చెక్కులను అందజేశారు.