ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ లో ఇందిరా మహిళా శక్తి టీ స్టాల్ ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రాంసాహయం రఘురాంరెడ్డి శనివారం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వశక్తితో ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. అనంతరం టీ తాగి అందర్నీ పలకరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.