ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో రైతులతో కలిసి కలెక్టర్ పొలాల్లో పంటలను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, ముచ్చటించారు. సాగునీరు కష్టాలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం తల్లంపాడు కాల్వగట్టు నుంచి యడవల్లి గ్రామంలోని పొలాలను ప్రత్యేక్షంగా చూసేందుకు రైతు బైక్ పై ప్రయాణించి మిర్చి, మొక్కజొన్న, టమాటా పంటలను పరిశీలించారు.