రాబోయే సంస్థాగత ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధమవ్వాలని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ ఎండీ. మౌలానా పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రూరల్ లో సీపీఐకి మొదటి నుంచి పట్టు ఉందని, గ్రామాల్లో ప్రజాసమస్యల పరిష్కారంలో పార్టీ శ్రేణులు ముందుండాలని, పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు నిరంతర పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.