ఖమ్మం రూరల్: అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీఓ

84చూసినవారు
ఖమ్మం రూరల్: అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీఓ
ఇటీవల వచ్చిన వరదలకు ధ్వంసమైన ఖమ్మం రూరల్ మండలం తీర్థాల అంగన్వాడీ-1 కేంద్రం, హరితహారం నర్సరీని శుక్రవారం జిల్లా కాంగ్రెస్ నేత బోడా వెంకన్నతో కలిసి ఎంపీడీవో కుమార్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం-1ను మరమ్మతులు చేయిస్తామని అన్నారు. అలాగే నూతన అంగన్వాడి కేంద్రం-2 నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించాలని సూచించారు. అటు స్థానిక శివాలయం ఆవరణంలో పబ్లిక్ టాయిలెట్స్ ను కూడా నిర్మిస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్