ఖమ్మం రూరల్: స్థానికేతరుల అక్రమ ఓట్ల చేర్పింపుపై నిరసన

65చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో స్థానికేతరుల అక్రమ ఓట్ల చేర్పింపుపై సిపిఐ(యం), సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంగన్వాడీ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. స్థానికేతరుల ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఒక వర్గానికి అనుకూలంగా ఓట్లు చేర్పిస్తున్న అంగన్వాడీ టీచర్ లను బీఎల్వో విధుల నుండి తొలగించాలని తహసిల్దార్ వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్