ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, నరేగ, పిఎం శ్రీ, హాస్టల్ లో సదుపాయాలు, తదితర వాటిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.