కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యం అయింది. నేలకొండపల్లి మండలం బైర్నపాడు గ్రామానికి చెందిన గుడివాడ ఉపేందర్ అత్తగారింటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం ఈత కొట్టేందుకు కాల్వలో దిగిన ఉపేందర్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. ఉదయం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు పంచనామా నిమిత్తం నేలకొండపల్లి ఆసుపత్రికి తరలించారు.