అర్హులైన ప్రతీ జర్నలిస్టుకి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు చేయించడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి విజయరామ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన జర్నలిస్టుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను తమ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.