కూసుమంచి: నీటి సరఫరా ఎలా ఉంది?

67చూసినవారు
కూసుమంచి: నీటి సరఫరా ఎలా ఉంది?
కేంద్ర గృహనిర్మాణ, అర్బన్ డెవలప్మెంట్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీత్ మంగళవారం జిల్లాలో పర్యటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన పలువురు అధికారులు కూసుమంచి మండలం పాలేరులోని మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యం, నీటి శుద్ది, రోజువారీ సరఫరా, లబ్ది పొందుతున్న గృహాల సంఖ్యను వారికి జిల్లా అధికారులు వివరించారు. ఆ తర్వాత జీళ్ల చెరువులోని నీటిశుద్ధి ప్లాంట్ ను కూడా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్