కూసుమంచి మండలం ధర్మతండాలో శ్రీలక్ష్మీ తిరుపతమ్మ తల్లిని శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మాలధారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా మంత్రికి ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు, మాలధారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు