కూసుమంచి మండలం జీళ్లచెరువు సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. మునిగేపల్లి, జీళ్లచెరువు మోటర్ లైన్, గోపాలరావుపేట గ్రామాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని సూచించారు.