కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యాన కూసుమంచి మండల కేంద్రంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించి మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ. కేంద్రం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేదల నడ్డి విరుస్తుందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే ఆందోళనలను ఉద్భతం చేస్తామన్నారు.