

భారత్ దాడులతో పాక్ తడిసిముద్దయ్యింది: పెంటగాన్ మాజీ అధికారి (VIDEO)
ఉగ్రవాద స్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపుదాడులతో పాకిస్థాన్ తడిసిముద్దయ్యిందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భయంతో తోక మెలిపెట్టే కుక్కలా పాక్ కాల్పుల విరమణ కోసం ఎదురుచూసిందని పేర్కొన్నారు. ఓటమిని మూటగట్టుకున్నా పాక్ తాము గెలిచామని చెబుతుండటం ఆశ్చర్యకరమన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో సైనికాధికారులు పాల్గొనడం, వారి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు.