కూసుమంచి మండలంలోని జీళ్లచెరువులో శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ. 2. 60కోట్ల నిధులు మంజూరయ్యాయి. స్థానికుల వినతితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నిధులు మంజూరు చేయించారు. గుట్టపైకి వెళ్లేందుకు రెండు వరుసల బీటీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణంతో పాటు గుట్టపై ఫ్లాట్ ఫాం, కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.