అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. కూసుమంచి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. కొనుగోళ్లు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల వరదకు కొట్టుకుపోయింది. వారం రోజుల్లో కోతకు వచ్చిన వరిపొలాలు వర్షానికి నేలవాలాయి. చేతికి అంది వచ్చిన ధాన్యం తడవడం, కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.