

గచ్చిబౌలి భూముల వివాదంపై PM మోడీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని మండిపడ్డారు. ‘అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందని, మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు’ అని మోడీ అన్నారు.