ఆన్‌లైన్ గేమ్ లు ఆడి డబ్బులు పోగొట్టుకుని మానసిక వ్యధతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూసుమంచి మండలం గైగోళ్లపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొరట్ల ఉపేందర్ (38) కూరగాయల వ్యాపారంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అతను ఆన్‌లైన్ గేమ్ లు ఆడుతూ పలుమార్లు డబ్బులు పోగొట్టుకున్నాడు. మానసిక ఒత్తిడికి గురై తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.