మాలలు మరో పోరాటానికి సిద్ధం కావాలి

56చూసినవారు
మాలలు మరో పోరాటానికి సిద్ధం కావాలి
మాలలందరూ ఐక్యంగా మరో పోరాటానికి సన్నద్ధం కావాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది పల్లా రాజశేఖర్ అన్నారు. బుధవారం తిరుమలాయపాలెంలో మాల మహానాడు మండల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలక ప్రజాప్రతినిధులు, నాయకులు మాలలను టార్గెట్ చేసి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. దీన్ని అధిగమించాలంటే రాష్ట్రంలో మాల సమాజం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్