ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేసిన మంత్రి

80చూసినవారు
ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేసిన మంత్రి
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం నగరంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, వరద నీటి కాల్వ, రోడ్డు వెడల్పు పనులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల వరద కాలువ వైడనింగ్ పనులు సి. ఆర్. జి. టవర్స్ దగ్గర పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లకారం చెరువు కాల్వ పనులను మంత్రి తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్