ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు రూపొందించాలి

54చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు రూపొందించాలి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ రూపకల్పన చేయాలని, భవిష్యత్తు పోరాటాలు ఎలా ఉండాలో నిర్దేశించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిరుమలాయపాలెంలో నాయకులు కొలిచలం స్వామి అధ్యక్షతన గ్రామ శాఖ మహాసభ జరిగింది. దేశంలో మతోన్మాద రాజకీయాలు పెరుగుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు వస్తున్నాయని అన్నారు. అనంతరం గ్రామ శాఖ నూతన కమిటిని ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్