నేలకొండపల్లి మండలంలోని ఆచర్లగూడెం గ్రామంలో శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద బాధితులు ఆందోళన నిర్వహించారు. అర్హత ఉన్నప్పటికీ తమకు కేటాయించకుండా అనర్హులకు ఎంపిక చేశారని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పురుగుమందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులతో చర్చించి, అర్హులకే ఎంపిక చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమింపజేశారు.