దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలం శ్రీరాజగోపాలస్వామి చైర్మన్ గా మన్నె వెంకటరవి, శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ గా చంద్రమౌళిలతో పాటు సభ్యులు శనివారం ప్రమాణాస్వీకారం చేశారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ అనిల్కుమార్, ఈఓ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ఉన్నారు.