నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన

74చూసినవారు
నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన
నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ పరిశీలించారు. లబ్ధిదారులను కలిసి పనులపై ఆరా తీశాక.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ సిప్ చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్