నేలకొండపల్లి: ఈనెల 30 వరకు బియ్యం పంపిణీ

85చూసినవారు
నేలకొండపల్లి: ఈనెల 30 వరకు బియ్యం పంపిణీ
రేషన్ షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడం, కార్డుదారుల నుంచి ఆరేసి సార్లు వేలిముద్రలు వేయిస్తుండడంతో జాప్యం జరుగుతుండగా రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీనెల 15వ తేదీ వరకు బియ్యం ఇస్తుండగా, ఈసారి 30వ తేదీ వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం అందరికీ తెలిసేలా దుకాణాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని డీలర్లను జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి (డీసీఎస్ఓ) చందన్ కుమార్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్