ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం చెన్నారం పాండవ చెలక కాలనీలో శనివారం అర్ధరాత్రి దారుణం ఘటన చోటు చేసుకుంది. చెన్నారం గ్రామానికి చెందిన పగడాల నాగయ్య అనే వృద్ధుడు తన కుమారుడి ఇంటికి సమీపంలో చిన్న రేకుల గది ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని పగడాల నాగయ్య మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.