పొలానికి వెళ్లేందుకు దారి లేని రైతుల కోసం ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అలాంటి సమస్య ఉన్న రైతులు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఈ చట్టం ద్వారా అన్నదాతలు భూమి హక్కు పొందవచ్చు. వెనుక ఉన్న పొలానికి ముందు ఉన్న పొలం రైతు దారి ఇవ్వాల్సిందే. లేదంటే సదరు రైతుపై కేసు నమోదు చేయొచ్చు. కౌలు రైతు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్లేందుకు రైతులు రోడ్డు కూడా నిర్మించుకోవచ్చు.