చాన్నాళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న ముదిగొండ, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లు ఈ పోలీసుస్టేషన్లకు ఎస్ఐలు ఎస్హెచ్ఓగా కొనసాగుతుండగా ఇక నుంచి సీఐలు వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా పలువురు సీఐలను బదిలీ చేశారు. ముదిగొండ ఎస్ హెచ్ఓ( సీఐ)గా ఖమ్మం పీసీఆర్ లో పనిచేస్తున్న అంజలిని, ఖమ్మం రూరల్ ఎస్ హెచ్ఓగా ముస్కా రాజును నియమించారు.