ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పాలేరు సబ్ డివిజన్ కార్యదర్శి బజ్జూరు వెంకటరామిరెడ్డి ఆరోపించారు. మంగళవారం నిరుపేదలతో కలిసి స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అర్హులైన పేదలకు వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.