ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నాయకులదేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కూసుమంచిలో ఆదివారం నియోజకవర్గ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.