చివరి అయకట్టు వరకు సాగునీరు అందే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు కలిసికట్టుగా రైతుల పంటలను కాపాడేందుకు పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. పాలేరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం, వాటర్ ఇన్ ఫ్లో లెవల్స్, సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు వదులుతున్న జలాల అవుట్ ఫ్లోను పరిశీలించారు.