ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ పంచాయితీ వాల్యాతండా, రెగ్యులతండాకు కలిపి ఒక రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గ్రామస్థులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. డ్రైనేజీ, మంచినీటి సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్థులు, సీపీఎం నాయకులు పొన్నం వెంకటరమణ తెలిపారు.