గంజాయి విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గంజాయి అమ్మే వారు ఎంత పెద్ద వారైనా పీడీ యాక్ట్ పెడతామని, గంజాయి, మత్తు పదార్థాలకు యువకులు బానిసలు కాకూడదని చెప్పారు. శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు. చుట్టూ ఉన్న గ్రామాలు అభివృద్ధి జరిగినప్పటికీ తెల్దారుపల్లిలో అభివృద్ధి జరగలేదన్నారు. త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారు.