ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు సీడీపీఓల బదిలీ జరిగింది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బదిలీ అయిన సీడీ పీల వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెం ప్రాజెక్టుకు సిడిపిఓ గా పనిచేసిన బాల త్రిపుర సుందరి ప్రస్తుతం మధిరకు బదిలీ అయ్యారు. దమ్మపేటలో సిడిపిఓ గా పనిచేస్తున్న రత్నకుమారి తిరుమలయపాలెం ప్రాజెక్టుకు నూతన సిడిపిఓగా నియమితులయ్యారు