ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోక్యాతండా గ్రామానికి చెందిన వడిత్య సేవుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.