వాతావరణంలో వచ్చిన మార్పులకు ప్రజలు విష జ్వరాల బారినపడుతున్నారు. మరోవైపు వానలు గత వారం రోజులుగా ముఖం చాటేయడంతో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. దాదాపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విపరీతంగా ప్రజలు జ్వరాలతో బాధపడుతుంటే , ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు.