మహిళ సర్పంచ్ ఇంగ్లీష్ స్పీచ్.. ఆశ్చర్యపోయిన ఐఏఎస్ ఆఫీసర్ (Video)
రాజస్థాన్ బార్మర్‌లోని ఓ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కలెక్టర్ టీనాదాబి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి కలెక్టర్‌కి ఆంగ్లంలో స్వాగతం పలికింది. అనంతరం ఆ వేదికపై నీటి సంరక్షణపై ప్రసంగించింది. అయితే ఆ సర్పంచ్ ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి టీనా సైతం ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయారు. ప్రస్తుతం టీనా దాబీ జైపూర్‌లో ఉపాధి హామీ పథకం కమిషనర్‌గా పనిచేస్తున్నారు.