దుక్కి దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్ ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందాడు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కిలారు ఉపేందర్ (39) గురువారం మధ్యాహ్నం ఓ రైతు చేను దున్నేందుకు వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్ బండరాయిపైకి ఎక్కడంతో అదుపు తప్పగా కింద పడిన ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఖమ్మంకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు.