తిరుమలాయపాలెం మండలం బచ్చోడు సెంటర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్, ఎస్సీ కాలనీలో ఉన్న 11 కేవీ లైన్ మార్చాలని కోరుతూ గ్రామస్తులు కూసుమంచి ఏడీఈ కోక్య నాయక్ కు వినతిపత్రం అందజేశారు. దీంతో సమస్యల పరిష్కారానికి ఏఈ మహేష్ ను ఆదేశించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై ఇటీవల గ్రామానికి వచ్చిన మంత్రి పొంగులేటికి కూడా విన్నవించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దయాకర్, యాదగిరి, తిమ్మిడి హనుమంతరావు ఉన్నారు.