తిరుమలాయపాలెం: ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

79చూసినవారు
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని గురువారం తిరుమలాయపాలెం మండల ఎమ్మార్వో రామకృష్ణకు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. రూ. 12 వేల జీవన భృతి, కొత్త పెన్షన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న హామీలను అమలు చేయలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్