రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం ఇలా ప్రతి ఇంటికి వేళల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గము ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తాం అన్నారు.