యువశక్తిని వినియోగించుకోవాలి: పీవైఎల్

72చూసినవారు
యువశక్తిని వినియోగించుకోవాలి: పీవైఎల్
దేశంలోని యువశక్తిని పాలకులు సద్వినియోగం చేసుకోవాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు బానోత్ ప్రేమ్ సింగ్ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని ఎం. వెంకటాయపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి యువత మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. యువతలో ప్రశ్నించే చైతన్యాన్ని తేవడం, దేశభక్తిని పెంపొందించడంలో పీవైఎల్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్