ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామానికి చెందిన ఓ యువతి(19)కి కొంతకాలంగా ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తున్నారు. తనకు ఇష్టంలేని వివాహం చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో మూడు రోజులుగా మనస్తాపంతో ఉన్న ఆమె బుధవారం పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆళ్లపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం పట్టణానికి తరలించారు.